రాష్ట్రపతికి ప్రధాని, అమిత్‌ షా శుభాకాంక్షలు

pm-modi-amit-shah-extend-greetings-to-president-kovind-on-his-birthday

న్యూఢిల్లీ: నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ పుట్టినరోజు ఈ సందర్భంగా ప్రధాని మోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విధాన నిర్ణయాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు గొప్ప అంతర్దృష్టి ఉందని, జాతికి రాష్ట్రపతి కోవింద్‌ గొప్ప ఆస్తి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంకితభావంతో ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమని తెలిపారు. పేదల సాధికారతకు అంకితభావంతో పనిచేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ 1945 అక్టోబర్‌ 1న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా పరాంఖ్‌ ప్రాంతంలో జన్మించారు. 2017 జూలై 25న ఆయన భారత 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/