అన్‌లాక్‌–5 మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

అక్టోబర్ 15 నుంచి విద్యాసంస్థలు తెరవడానికి అనుమతి

50 శాతం సీట్ల భర్తీతో థియేటర్లకు అనుమతి

Unlock 5.0- Cinema halls, entertainment parks allowed to open

న్యూఢిల్లీ: కేంద్రం అన్‌ లాక్‌-5 మార్గదర్శకాలు విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇదే సమయంలో ఆన్ లైన్, డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు చెప్పింది. అయితే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థుల విషయంలో మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యాసంస్థలు అనుమతి తీసుకోవాలని చెప్పింది. హాజరుకై పట్టుపట్టకూడదని కండిషన్ పెట్టింది. ఇదే సమయంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/