ఎయిర్ పోర్ట్ అధికారి ఫై మోడీ ఆగ్రహం

ప్రధాని మోడీ ..ఎయిర్ పోర్ట్ అధికారి ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ను కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. విదేశీ టూర్ ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని, ఎయిర్ పోర్ట్ లో విమానం దిగి వస్తుండగా ఎయిర్ పోర్ట్ అధికారి నమస్కారం చేస్తూ మోడీకి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసారు. దాంతో ఆగిపోయిన ప్రధాని… వెనక్కి వెళ్లాలని ఆ అధికారికి సూచించారు. మోడీ ఏం చెబుతున్నారో ఆ అధికారికి అర్థం కాకపోవడంతో ఇంకొచ్చాం ముందుకు వెళ్ళాడు. దాంతో మోడీ మరింత అసహనానికి లోనయ్యారు. బాగా వెనక్కి వెళ్లు అంటూ చేతులు ఊపుతూ సైగల్ చేశారు.

అక్కడున్న ఇతరులు ఆ అధికారిని వెనక్కి వచ్చి నిలుచోవాలని సూచించారు. ఆ వ్యక్తి వెనక్కి వచ్చి నిలుచోవడంతో, అప్పుడు మోడీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. దీనికి సంబదించిన వీడియో ను కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి , దీనిపై స్పందించారు. “కొరియోగ్రఫీకి గురువు అనదగ్గ వ్యక్తి (మోడీ) ఏం చేశాడో చూడండి” అంటూ ఆ వీడియోను రీట్వీట్ చేశారు.