రేపటి నుండి ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతున్న సల్మాన్ ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్’

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్ మూవీ రేపటి నుండి Z5 లో స్ట్రీమింగ్ కాబోతుంది. టాలీవుడ్ నటులు జగపతి బాబు , వెంకటేష్ లు నటించడం , రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర పోషించడం , పూజా హగ్దే హీరోయిన్ గా నటించడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రంజాన్ సందర్బంగా విడుదలైన ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యి..చివరకు సల్మాన్ ఖాతాలో భారీ ప్లాప్ గా నమోదైంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న జీ 5వారు రేపు (మే 26) నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. హీరోగా .. నిర్మాతగా ఈ సినిమా సల్మాన్ కి నిరాశను మిగిల్చింది. వరుస ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డేకి ఈ సినిమా హెల్ప్ కాలేకపోయింది. థియేటర్స్ లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.