పొంగులేటి, జూపల్లితో 4 గంటలకు పైగా ఈటెల భేటీ

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో వీరి భేటీ అయ్యారు. దాదాపు 4 గంటలకు పైగా వీరి సమావేశం నడుస్తుంది. ఇటీవలే ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి వెళ్లిన బీజేపీ నేతలు పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు మరోసారి భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావులను మొదటి నుండి బిజెపి పార్టీ తమ పార్టీ లోకి ఆహ్వానం ఇస్తుంది. కానీ వీరిద్దరూ మాత్రం కాస్త ఆలోచిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం భారీ ఆఫర్లే వీరిద్దరికి ఇచ్చింది. దీంతో అటు వెళ్లాలా..? ఇటు వెళ్లాలా అనే ఆలోచనలో ఉన్నారు. గత కొద్దీ రోజులుగా పొంగులేటి తన అభిమానులతో సమావేశమవుతూ భవిష్యత్ రాజకీయాల ఫై చర్చలు కొనసాగిస్తున్నారు. వారి నిర్ణయం ఫై తన అడుగు వెయ్యాలని చూస్తున్నారు. మరి ఫైనల్ గా పొంగులేటి ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో చూడాలి.