మహా ధర్నాలో అరుదైన సంఘటన..

వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, ధాన్యం సేకరణపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ గురువారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో మహాధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ ధర్నా , మధ్యాహ్నం 2 గంటలకు వరకు జరగనుంది. ఈ ధర్నా లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు , ఎమ్మెల్యేలు , మ్మెల్సీ లు , నేతలు ఇలా చాలామంది హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ధర్నా చౌక్‌ వద్దకు వెళ్లినప్పటికీ… ఆయన స్టేజ్‌ పైకి వెళ్లకుండా మామూలు కార్యకర్త లాగే… జనం మధ్యంలో కూర్చోని తన నిరసన తెలిపారు. కేసీఆర్‌ కూతురు కవిత, హరీష్‌ రావు స్టేజ్‌ ఎక్కినప్పటికీ కేటీఆర్‌ మాత్రం జనాల్లోనే ఉండి నిరసన తెలిపారు. ఇది చూసి చాలామంది తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన సంఘటన తెలంగాన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఇక ఈ ధర్నాలో కేసీఆర్ మాట్లాడుతూ..హైద‌రాబాద్ న‌గ‌రంతో ప్రారంభ‌మైన ఈ ఉద్య‌మం ఇక్క‌డితో ఆగ‌దు. అవ‌స‌ర‌మైతే ఢిల్లీ వ‌ర‌కు కూడా యాత్ర చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. ఎక్క‌డిదాకా అయినా స‌రే పోయి మ‌న ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించుకోవాలి. తెలంగాణ పోరాటాల గ‌డ్డ‌, విప్ల‌వాల గ‌డ్డ‌. త‌న‌ను తాను ర‌క్షించుకోవాల‌నో తెలుసు. ప‌రాయి పాల‌కుల విష కౌగిలి నుంచి బ‌య‌ట‌ప‌డి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఒక అద్భుత‌మైన ప‌ద్ధ‌తిలో ముందుకు పోతున్నాం. తెలంగాణ రైతాంగానికి అశ‌నిపాతంలాగా ఈ కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు దాప‌రిస్తున్నాయి. వాటిని ఎద‌ర్కోవ‌డానికి, కండ్లు తెరిపించ‌డానికీ ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టం అన్నారు.