జీహెచ్‌ఎంసీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఈనెల 20 వరకు నామినేషన్ల స్వీకరణ

GHMC
GHMC

హైదరాబాద్‌: నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆరోవ్లఉ నోటీసులు విడుదల చేశారు. దీంతో ఈరోజు నుండి ఈ నెల 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 21 నామినేషన్ల పరిశీలన. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. 150 రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లోకి అనుమతిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్‌ఎంసీ తొలగిస్తుంది. ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపునకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. నిన్న ఒక్కరోజే దాదాపు 4 వేలకు పైగా ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/