రైతుల ఖాతాల్లో జమకానున్న కిసాన్‌ సమ్మాన్‌ నిధులు..!

PM Kisan Samman Nidhi Yojana: 16th Installment To Be Released On Feb 28

న్యూఢిల్లీః కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.21వేలకోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.

పథకం కింద 11 మందికిపైగా రైతులకు రూ.3లక్షలకోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది. దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ‘నమో షేత్కారీ మహాసమ్మన్ నిధి’ రెండో, మూడో విడత నిధులను సైతం ప్రధాని పంపిణీ చేయనున్నారు. దీంతో మహారాష్ట్రవ్యాప్తంగా దాదాపు 88 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో భాగంగా ఏడాదికి రూ.6వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున సాయం విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు 15 విడుదతల్లో నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది.

అయితే, 16వ విడద సహాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా గతేడాది నవంబర్‌ 15న ప్రధాని 15వలో 8వేలకోట్లకుపైగా రైతులకు రూ.18వేల కోట్లు జమ చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం ఆవాస్ యోజనను ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.375 కోట్లను 2.50 లక్షల మంది లబ్ధిదారులకు బదిలీ చేస్తారు. దాంతో పాటు మహారాష్ట్రలో రూ.1,300 కోట్లకుపైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు.