తన బాధను పట్టించుకోవడం లేదని షర్మిల ఆవేదన..

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకరావాలని షర్మిల ..రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీ ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతూ వస్తుంది. కేసీఆర్ సర్కార్ లో మార్పు తీసుకరావాలని షర్మిల ట్రై చేస్తుంది కానీ..కేసీఆర్ సర్కార్ మాత్రం షర్మిల దీక్షను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి వారం రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట దీక్ష చేపడుతుంది కానీ ప్రభుత్వానికి మాత్రం చీమ కొట్టినట్లు కూడా లేదు.

వరంగల్ పట్టణంలోని హయగ్రీవాచారి గ్రౌండ్స్ సమీపంలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేసింది. ఇక ఈ దీక్ష సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఎంతలా గ‌ళం వినిపిస్తున్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎలాంటి రియాక్టు కావట్లేదని ఆమె చెప్ప‌డం చూస్తే ఆమె ఆవేదన కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ సర్కారుకు తాను చేస్తున్న దీక్ష‌ల వ‌ల్ల చీమ కుట్టినట్లుగా కూడా అనిపించ‌ట్లేదని చెబుతున్నారు.

ఇక ఇలా కేసీఆర్ ఎంత‌లా స్పందించ‌క‌పోయినా కూడా తాను మాత్రం దీక్షలు చేస్తానని ఆమె చెప్పారు. అంటే ఆమె మాట‌ల్లో త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే బాధ మాత్రం స్పష్టంగా క‌నిపిస్తోంది.