ఉద్యోగంలో ఎదుగుదల : అవరోధాలు కల్గించేవారూ ఉంటారు జాగ్రత్త!

జీవన వికాసం

ఉద్యోగం ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుంది… ఆత్మా విశ్వాసాన్ని పెంచుతుంది.. సంతోషాన్ని , సంతృప్తిని ఇస్తుంది. గుర్తింపు తెచ్చిపెడుతుంది.. ఇన్ని లాభాలు చేకూర్చే ఉద్యోగంలో ఉన్న స్థితిలోనే ఉండిపోలేంకదా. మరింత ఉన్నతి సాధించే క్రమంలో ఈ సూత్రాలు పాటించమంటున్నారు కెరీర్ కౌన్సెలర్లు ..

Job growth : Life development

తోటి ఉద్యోగులు మీలాగే ఉండాలని ఆశించొద్దు . ఒకరికి సలహాలు ఇవ్వాలని చూడొద్దు.. మంచికి పోయినా పెడర్ధాలు తీసేవారు ఉంటారని గుర్తుంచుకోండి.. మీ వరకూ మీరు ఎంత నాణ్యమైన ఉత్పాదకతను ఇవ్వగలరో ఆలోచించాలి.. ప్రణాళికతో , నిబద్దతతో పనిచేయండి..
ఏ రంగంలో నైనా ప్రోత్సహించి సాయం అందించేవారితో బాటు , నిరుత్సాహపరుస్తూ అవరోధాలు కలిగించేవారు ఉంటారు అలాంటివారి మీద కోపతాపాలు వద్దు.. అప్రమత్తంగా ఉంటూ లక్ష్యం దిశగా సాగండి..

ఉద్యోగం ఇష్టంగా కాకుండా భారంగా అనిపించిందంటే ఎదుగుదల మీద ధ్యాస తగ్గుతుంది.. శారీరక, మానసిక ఆరోగ్యము దెబ్బతినే ప్రమాదముంది.. కనుక చేసే పనుల్లో ఎప్పటికప్పుడు సులువైన మార్గాలు కనిపెట్టండి..

సహోద్యోగులు లేదా పై అధికారుల విషయంలో మీకేదైనా అసంతృప్తి ఉన్నా , ఆ విషయాలు చర్చకు పెట్టొద్దు.. అవి చిలవలు పలవలై మీమీద సదాభిప్రాయాన్ని పోగొడతాయి.

Job growth : Life development

ఎంత సమర్ధంగా చేస్తున్న ఒక్కోసారి ఆశించిన ఫలితం రాకపోవచ్చు.. అడ్డంకులు ఎదురవ్వచ్చు… మనం నడిచే దారిలో ముళ్ళూ, రాళ్ళూ ఎదురైనంతలో ఢీలా పది వెనక్కెళ్లం కదా.. ఉద్యోగమైనా అంతే .. తెలివిగా దాటుకుంటూ ముందుకెళ్లాలి..

ముందుగా లక్ష్యాలను నిర్ధేశించుకుంటే వాటిని ఎలా చేరాలో స్పష్టత వస్తుంది.. సునాయాసంగా గమ్యం చేరిపోతామని ఊహల్లో తేలిపోవద్దు.. ఏవైనా ఆటంకాలూ ఎదురైనంతలో నిరాశ చెందక పట్టుదలగా ప్రయత్నించాలి..
పనిలో మూస విధానానికి స్వస్తి చెప్పండి.. లేదంటే ఎదుగుదల ఉండడు .. ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఏం చేయచూ ఆలోచించండి..

తోటి ఉద్యోగులతో విభేదాలు వస్తే ఆ విషయాన్ని వారితోనే చర్చించండి.. విషయం తేటతెల్లం అవుతుంది.. అంతే తప్ప తొందరపడి ఉద్యోగం మానేయొద్దు . అశాంతిని కొనితెచ్చుకోవద్దు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/