ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో (Phone Tapping Case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం ఉదయం గాంధీ అస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా వెస్ట్ జోన్ డీసీపీ అధికారికంగా ప్రకటించారు.

ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను టాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. అనధికారికంగా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. కొంతమంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారిక డ్యూటీలో ఉండి కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు. గత ప్రభుత్వానికి ఫోన్ టాపింగ్ చేసి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. టాపింగ్ డివైస్‌లతోపాటు హార్డ్‌వేర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు నిర్దారించారు.