కాంగ్రెస్ నాలుగో లిస్ట్ విడుదల

కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది. 46 మంది తో కూడిన లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఎలాంటి పేరును ప్రకటించలేదు. అస్సాం, అండమాన్, ఛత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్ నుంచి అభ్యర్థులను ప్రకటించింది.

కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఈ జాబితాలో చోటు దక్కింది. తమిళనాడులోని శివగంగ నుంచి ఆయన మరోసారి పోటీ చేస్తోన్నారు. ఇది చిదంబరం కుటుంబం సొంత నియోజకవర్గం. పీ చిదంబరం ఇక్కడి నుంచే ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 నాటి ఎన్నికల్లో ఆయన కుమారుడు కార్తీ ఇక్కడ విజయం సాధించారు. కృష్ణగిరి- కే గోపీనాథ్, కరూర్- ఎస్ జోతిమణి, కడలూర్- డాక్టర్ ఎంకే విష్ణుప్రసాద్, విరుధ్ నగర్- బీ మాణిక్కం ఠాగోర్, కన్యాకుమారి- విజయ్ వసంత్‌లను బరిలోకి దించింది. మాణిక్కం ఠాగోర్‌ గతంలో తెలంగాణకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా పని చేసిన విషయం తెలిసిందే.