వివేకా హత్య కేసు..ఫోన్ కాల్స్ వివరాలుః సీబీఐ

మార్చి 14 సాయంత్రం నుండి మార్చి 15 ఉదయం వరకు ఫోన్ కాల్స్ వివరాలు కోర్టుకు ఇచ్చిన సీబీఐ

phone-calls-in-viveka-murder-case

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సిపి నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన సీబీఐ ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో ఎన్నో అంశాలను పొందుపరిచింది దర్యాఫ్తు సంస్థ. ఇందుకు సంబంధించి హత్య జరిగిన రోజున నిందితుల మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలకు సంబంధించిన వివరాలను కూడా ప్రస్తావించింది. 2019 మార్చి 14వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 15 ఉదయం 8 గంటల వరకు ఎవరెవరి మధ్య ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్లాయో తెలిపింది.

. వైఎస్ అవినాశ్ రెడ్డి తన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డికి మార్చి 14వ తేదీ సాయంత్రం 6.18 నిమిషాలకు ఓ ఫోన్ కాల్ చేశారు.
. ఉదయ్ కుమార్ రెడ్డి మార్చి 14న రాత్రి గం.9.12 నిమిషాలకు, ఆ తర్వాత మార్చి 15న ఉదయం గం.6.10 నిమిషాలకు… రెండుసార్లు వైఎస్ అవినాశ్ కు ఫోన్ చేశాడు.
. శివశంకర రెడ్డి మార్చి 15వ తేదీ ఉదయం గం.5.58 నిమిషాలకు వైఎస్ అవినాశ్ కు ఫోన్ చేశాడు. మార్చి 14న సాయంత్రం నుండి రాత్రి వరకు మూడుసార్లు ఫోన్ చేశాడు.
. గంగిరెడ్డి మార్చి 14న రాత్రి గం.8.02 నిమిషాలకు, మార్చి 15న ఉదయం మరోసారి శివశంకర రెడ్డికి ఫోన్ చేశాడు.
. గంగిరెడ్డి మార్చి 14న రెండుసార్లు సునీల్ యాదవ్ కు ఫోన్ చేశాడు.
. ఉమాశంకర్ రెడ్డి మార్చి 15న ఉదయం గంగిరెడ్డికి ఒక ఫోన్ కాల్ చేశాడు.
. ఉమాశంకర్ రెడ్డి 5సార్లు సునీల్ యాదవ్ కు ఫోన్ చేశాడు. 2 ఎస్సెమ్మెస్ లు పంపించాడు. సునీల్ యాదవ్ కూడా రెండుసార్లు ఉమాశంకర్ రెడ్డికి ఫోన్ చేశాడు.
. షేక్ దస్తగిరి మూడుసార్లు సునీల్ యాదవ్ కు ఫోన్ చేశాడు. 22 ఎస్సెమ్మెస్ లు పంపించాడు.
. సునీల్ యాదవ్ రెండుసార్లు షేక్ దస్తగిరికి ఫోన్ చేశాడు. 4 ఎస్సెమ్మెస్ లు పంపించాడు.