మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Union Cabinet approves Interim Budget

న్యూఢిల్లీః కేంద్ర కేబినెట్‌ గురువారం సమావేశమైంది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఈ ఏడాది ఏప్రిల్‌, మే మధ్య పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బడ్జెట్‌కు ముందు నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రికి స్వీటు తినిపించారు.

అనంతరం అక్కడి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు చేరుకొని కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్నారు. బడ్జెట్‌ నేపథ్యంలో పత్రులు పార్లమెంట్‌కు చేరుకున్నారు. మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా ఐఎంసీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌ సమీర్‌ సోమయ్య మాట్లాడుతూ మధ్యంతర బడ్జెట్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు. దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉందని.. వారికి నైపుణ్యం అవసరమన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ 6.5శాతం అంతకంటే వేగంగా వృద్ధి చెందేందుకు రక్షణ, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో స్టార్టప్‌లను సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా కేవీ సుబ్రమణియన్ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్‌ను జూన్‌, జూలైలో తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత మధ్యంతర బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు ఉండకపోవచ్చన్నారు. ఆర్థిక వ్యవస్థ చాలా మంచి స్థితిలో ఉందని, 7.3 శాతం వేగంతో వృద్ధి చెందుతుందన్నారు.