21వ రోజు ఆగని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోలుపై 25 పైసలు .. డీజిల్‌పై 21 పైసలు పెంపు

Petrol
Petrol

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా 21వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. నేడు లీటరు పెట్రోలుపై 25 పైసలు పెరగ్గా, డీజిల్‌పై 21 పైసలు పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 80.38కు చేరుకోగా, డీజిల్ ధర రూ.80.40కు పెరిగింది. తాజా పెంపుతో గత మూడు వారాల్లో డీజిల్‌పై 10.27 రూపాయలు, పెట్రోలుపై 9.18 రూపాయలు చొప్పున పెరిగాయి. జూన్ 1న రూ.71 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.80.38కు చేరడం గమనార్హం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/