శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌ చౌహాన్‌

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్‌ సిఎం

శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌ చౌహాన్‌
Madhya Pradesh CM Shivraj Singh Chouhan at Tirumala
శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌ చౌహాన్‌
శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌ చౌహాన్‌

తిరుమల: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ కుటుంబ సమేతంగా శనివారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు లాంఛనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ద్వారా ఆలయానికి తీసుకెళ్లారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో సిఎం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ను శాలువాతో సత్కరించారు. విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నుండి త్వరగా విముక్తి పొందాలని, దేశ రక్షణ కోసం పోరాడే సైనికులకు మరింత శక్తిని ప్రసాదించాలిన శ్రీవారిని ప్రార్థించినట్లు మధ్యప్రదేశ్‌ సిఎం తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/