వరుసగా 11వ రోజూ పెరిగిన ఇంధన ధరలు

పెట్రోలుపై రూ.6.02, డీజిల్‌పై రూ. 6.40 పెరుగుదల

petrol-and-diesel
petrol-and-diesel

న్యూఢిల్లీ: గత 11 రోజులుగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. నేడు పెట్రోలుపై 55 పైసలు, డీజిల్‌పై 60 పైసలు పెంచాయి. తాజా పెరుగుదలతో పెట్రోలుపై రూ.6.02 పైసలు, డీజిల్‌పై రూ. 6.40 పెరిగింది. ఇక తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 80 దాటేసి రూ. 80.22కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 74.07గా నమోదైంది. ఏపీ రాజధాని అమరావతిలో లీటరు పెట్రోలు ధర హైదరాబాద్ కంటే ఎక్కువగా రూ.80.66గా ఉంటే, డీజిల్ ధర రూ. 74.54గా ఉంది. ఇక, ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ. 77.28, రూ.75.79గా నమోదు కాగా, చెన్నైలో రూ. 80.86, రూ.73.69కి పెరిగాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/