దేశంలో ఒక్కరోజే 2003 మంది కరోనాతో మృతి

మొత్తం కేసుల సంఖ్య 3,54,065..మొత్తం మృతుల సంఖ్య 11,903

India records 10,974 new cases of corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 10,974 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 2,003 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,54,065కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 11,903కు పెరిగింది. 1,55,227 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,86,935 మంది కోలుకున్నారు. ఈమేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను విడుదల చేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/