వాహనదారులకు కేంద్రం తీపి కబురు ..?

వాహనదారులకు కేంద్రం తీపి కబురు అందించబోతుందా..? అంటే అవుననే అనిపిస్తుంది. గత కొద్దీ నెలలుగా దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు పెరగడమే కానీ తగ్గడం లేదు. రూ. 60 ఉన్నలీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 115 కు చేరుకుంది. పెరిగిన పెట్రోల్ , డీజల్ ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలీచాలని జీతాలతో ఇల్లు గడవడమే గగనమై పోయిన ఈరోజుల్లో ఈ పెట్రోల్ ధరలు మరింత కుంగదీస్తున్నాయి. పెట్రోల్ , డీజిల్ ధరల ఫై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఈ తరుణంలో కేంద్రం ఓ మెట్టు కిందకు దిగినట్లు తెలుస్తుంది. కేంద్ర తీసుకోబోయే నిర్ణయంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. పెట్రొల్, డీజిల్‌పై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం పెట్రోల్, డీజిల్ సహా మరికొన్నింటిపై పన్నులు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డాక నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రొల్, డీజిల్‌పై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గిస్తే ధరలు కాస్త తగ్గడం ఖాయం. ఇక వాహనదారులు కూడా కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.