మాంసం ప్రియులకు గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన చికెన్ ధర

గతంలో సండే వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ కర్రీ ఉండాల్సిందే. ముక్క లేనిదే ముద్దా దిగదు అనే వారు. కానీ ఇప్పుడు ఆలా కాదు సండే , మండే అనే తేడాలేకుండా ఎప్పుడు తినాలపిస్తే అప్పుడు తినేస్తున్నారు. అయితే గత కొద్దీ రోజులుగా చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. కిలో చికెన్ ధర దాదాపు రూ. 250 వరకు ఉంది. చాలామంది ఈ ధర చూసి వామ్మో అని తినడం మానేస్తున్నారు. కాగా ప్రస్తుతం చికెన్ ధరలు భారీ తగ్గుతున్నాయి.

మొన్నటివరకు కిలో రూ 250 ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ. 160 , 170 నడుస్తుంది. ఈ ధర ఇంకా తగ్గనున్నట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నారు. హైదరాబాద్ మహానగరం తో పాటు విశాఖ మరియు ఇతర కీలక ప్రాంతాలలో కిలో చికెన్ రేట్ 160 రూపాయలకు చేరింది. ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడం వల్ల రేట్లు భారీగా పడిపోయాయని వ్యాపారాలు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడం , చికెన్ ధరలు తగ్గడం తో చాలామంది హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.