13వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

పెట్రోలుపై లీటరుకు 56 పైసలు..డీజిల్‌పై లీటరుకు 63 పైసల పెంపు

The burden on petrol
petrol

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో వరుసగా 13వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 56 పైసలు, డీజిల్‌పై లీటరుకు 63 పైసలు పెరిగాయి. 13 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.7.11, డీజిల్‌ ధర రూ.7.67 పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.78.37కి, డీజిల్ ధర రూ. 77.06కి చేరింది. ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.85.21కి, డీజిల్‌ 75.53కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.81.82, డీజిల్ ధర రూ.74.77గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.80.13, డీజిల్ ధర రూ.72.53గా ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/