యూపీఐ చెల్లింపులపై సర్​ఛార్జీలు : కేంద్రం ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 01 నుండి యూపీఐ చెల్లింపులపై సర్​ఛార్జీలు పడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం సామాన్యులను దోచుకోవడానికి మరో దారి వెతుక్కుందని ఆరోపించారు. పారదర్శక చెల్లింపుల పేరుతో ప్రజలను ఆన్‌లైన్‌కు అలవాటు చేసిన కేంద్రం ఇప్పుడు వాటిపై 1.1 శాతం రుసుము వసూలు చేయటం మోడీ కుటిల నీతికి నిదర్శనమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏటా 10లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయని వాటిపై 11వేల కోట్లు అదనంగా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు.

ప్రస్తుతం దేశ ప్రజలు నగదు రహిత లావాదేవీలకే అలవాటు పడిన సంగతి తెలిసిందే. మొదటి నుండి నగదురహిత లావాదేవీలను కేంద్రం ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. దీంతో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఎలాంటి ఛార్జెస్ లేకపోవడం తో ఫోన్ పే, గూగుల్ పే, PTM మొదలగు UPI యాప్స్ తో ప్రజలు మనీ ట్రాన్స్ఫర్ కు అలవాటుపడ్డారు. రూపాయి దగ్గరి నుండి లక్షల వరకు అంత ఆన్లైన్ లోనే UPI యాప్స్ తోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాపడితే ఆలా..ఎంతపడితే అంతే చేస్తూవచ్చారు.

కానీ ఏప్రిల్ 1 నుండి ఆలా చేస్తే మీ అకౌంట్ లో జీరో బాలన్స్ అయ్యినట్లే. ఎందుకంటే ఇక నుంచి ఛార్జెస్ మోత మోగనుంది. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ యాప్స్ ద్వారా చేసే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రూమెంట్ ట్రాన్సక్షన్లు రూ.2 వేలు మించితే మాత్రం 1.1 శాతం వరకు ఛార్జీలు పడనున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(npci) సర్క్యూలర్ విడుదల చేసింది. దాని ప్రకారం.. మర్చంట్ ట్రాన్సాక్షన్లపై పీపీఐ ఛార్జెస్ పడనున్నాయి.

పీపీఐ పేమెంట్స్ చేసే ట్రాన్సాక్షన్లపై 0.5 శాతం నుంచి 1.1 వరకు ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. పెట్రోల్- డీజిల్ చెల్లింపులపై 0.5 శాతం, విద్య, వ్యవసాయం, టెలికాం వంటి అవసరాల కోసం 0.7 శాతం, సూపర్ మార్కెట్లలో 0.9 శాతం, గవర్నమెంట్, బీమా, రైల్వేస్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిపై 1 శాతం వరకు ఇంటర్ఛేంజ్ ఛార్జెస్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ ని అప్రూవ్ చేయడం, ఆథరైజ్, ప్రాసెస్ వంటి వాటిపై ఈ ఛార్జెస్ వసూలు చేయనున్నారు.