వలస కార్మికులను ఆదుకోవాలని సుప్రీంలో పిటీషన్‌

supreem court
supreem court

దిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు దేశంలో లాక్‌డౌన్‌ విదించడంతో, వలస కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ప్రభుత్వాలు వేతనం చెల్లించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. ప్రస్తుతం ప్రజలు ఉపాధి లేక, సోంత గ్రామాలకు వెళ్లడానికి ప్రయాణ సౌకర్యం లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలుసు. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్తలు హర్ష మాందర్‌, అంజలి భరధ్వాజ్‌లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్‌ వేశారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ దీపక్‌ గుప్తా ధర్మాసనం పిటీషన్‌ ను విచారణకు తీసుకుంది. దీనిపై సమాధానం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబందించి తదుపరి విచారణను ఏప్రిల్‌ 7కు వాయిదా పడింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/