అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి

గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్, మొతేరాలో స్టేడియం

అహ్మదాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈరోజు వర్చువల్‌ విధానం ద్వారా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన సర్దార్‌ పటేల్‌(మొతేరా) స్టేడియంను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు, గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్ పాల్గొన్నారు. అహ్మ‌దాబాద్‌లోని ఈ స్టేడియాన్ని పున‌రుద్ధ‌రించిన విష‌యం తెలిసిందే. ల‌క్షా ప‌ది వేల సామ‌ర్థ్యంతో ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు సృష్టించింది.


రూ.800 కోట్ల వ్యయంతో నిర్మితమైన మొతేరా స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ చూసే అవ‌కాశం ఉంఉటంది. ఈ స్టేడియంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ భారత్‌ ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. కాసేప‌ట్లో ఇరు దేశాల మ‌ధ్య ఈ డేనైట్ మూడో టెస్టు మ్యాచు ప్రారంభం కానుంది. గులాబి బంతితో ఈ మ్యాచ్ ఆడనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/