కరోనా నిర్ధారణకు మరొక పద్దతి… ఐసిఎంఆర్‌

రివర్స్‌ ట్రాన్స్‌ క్రిప్సన్‌-పీసీఆర్‌ విధానంలో పరీక్షించండి

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజరోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది . ఈ సమయంలోనే సాధ్యమైనంత త్వరగా కరోనా కేసులను గుర్తించాలని, ది ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) కేంద్రానికి సలహ ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం 20 హాట్‌స్పాట్‌ కేంద్రాలున్నాయని, మరో 22 ప్రాంతాలు కోవిడ్‌-19 హాట్‌స్పాట్స్‌గా మారనున్నాయని ఐసిఎంఆర్‌ పేర్కొంది. ఈ ప్రాంతాలలో యాంటీ బాడీ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని సూచించింది. దేశంలో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోనేందుకు ఐసీఎంఆర్‌ నేతృత్వంలో నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు కాగా, నేడు తొలి సమావేశ జరిగింది. ఇందులో పాల్గోన్న సభ్యులు, వైరస్‌ను గుర్తించడానికి ప్రస్తుతం వ్యక్తి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారని , దీని కారణంగా సమయం ఎక్కువ అవుతుందని అన్నారు. రివర్స్‌ ట్రాన్స్‌ క్రిప్సన్‌- పీసీఆర్‌ (ఆర్టీ-పీసీఆర్‌) విధానంలో వ్యక్తి గొంతు, ముక్కులోని ద్రవాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తే వైరస్‌ నిర్ధారణ 15 నుంచి 30 నిమిషాలలోనే అవుతుందని తెలిపారు. ఫలితంగా వైరస్‌ వ్యాప్తిని నివారించవ్చని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/