ఏపిలో మద్యం విక్రయాలపై హైకోర్టులో పిటిషన్‌

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాతృభూమి ఫౌండేషన్

ap high court
ap high court

అమరావతి: ఏపిలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది. ఈనేపథ్యలో మద్యం విక్రయాలపై మాతృభూమి ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లలో భౌతికదూరం అమలులో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ ఆరోపించారు. మద్యపానం కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే గురువారం పిటిషనర్‌ తరపు న్యాయవాది రిప్లై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/