GST బాదుడుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు

trs party agitations against the centre over gst

పాలు, పాల ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులపై కేంద్రం విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధువారం టిఆర్ఎస్ పార్టీ నిరసలు చేసారు. ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంటే.. కేంద్రం మాత్రం పన్నుల పేరుతో పేదలను నిలువు దోపిడీ చేస్తోందని, కార్పోరేట్ శక్తులు వేల కోట్లు ఎగవేస్తుంటే వారిని ఏమీ అనని కేంద్రం.. సామాన్యులపై భారం మోపుతోందని నేతలు విమర్శించారు. అన్ని జిల్లాలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసలు జరిపారు. కార్మిక, రైతు, సైనిక, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రాన్ని గద్దెదించి.. తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీరు చూస్తుంటే భవిష్యత్తులో పీల్చే గాలి పైన కూడా జీఎస్టీ వేస్తారేమోనని భయంగా ఉంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మరోపక్క పార్లమెంట్ లోను GST కి వ్యతిరేకంగా కాంగ్రెస్ , టిఆర్ఎస్ ఎంపీలు నిరసనలు వ్యక్తం చేసారు.

ఇప్పటికే పలు వాటిపై GST పేరుతో భారం మోపుతున్న కేంద్ర సర్కార్..ఇప్పుడు నిత్యావసరాలను కూడా వదల్లేదు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలు , ఉప్పు , పప్పు, కూరగాయలు ఇలా ఏది వదలకుండా అన్నింటిపై GST భారం మోపుతోంది. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబును కేంద్రం ఇలా దర్జాగా పన్నుల పేరుతో దోచేస్తుండటంతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఇప్పటికే చింతపండు, చక్కెర, వంటనూనెలు తదితర అన్నింటిపైనా జీఎస్టీ విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు పసిపిల్లల నోటికాడి పాలనూ ఉపేక్షించలేదు. పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటి ప్రీప్యాక్డ్‌, ప్రీలేబుల్డ్‌ పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వేశారు. అంతేగాక డెయిరీ మిలింగ్‌ మిషనరీపై జీఎస్టీని 12% నుంచి 18 శాతానికి పెంచారు. ఈ నిర్ణయాలతో పాలు, పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటివాటి కోసం ప్రతి కుటుంబం కనీసం 10-15% అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటికే పశువుల మేత దగ్గర్నుంచి అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలు ప్రభావితమయ్యాయి.