రేపు జగన్ మీటింగ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పైనేనట..

perni-nani

గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో , మీడియా లో సోమవారం జగన్ సమక్షంలో జరగబోయే సమావేశం ఫై విపరీతమైన చర్చ నడుస్తుంది. ఈ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని… ఓ మంత్రికి పదవి గండం ఉండబోతుందని.. మరో కీలక ఎమ్మెల్యే కేబినెట్ లోకి రాబోతున్నారని..ఇలా ఎవరికీ వారు ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీంతో అంత ఈ సమావేశం కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో మాజీ మంత్రి పేర్ని నాని సమావేశం గురించి లీక్ చేసారు. రేపు జగన్ తో మీటింగ్ కేవలం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీదనే ఉంటుంది. ఇంతకాలం చేసిన ఈ కార్యక్రమం పైన అందరి సలహాలను తీసుకోవడానికి మాత్రమే సీఎం జగన్ మీటింగ్ పెడుతున్నారు. మీరు అనుకుంటున్నట్లు కేబినెట్ గురించి అయితే కాదు.. ఎప్పుడు ఏ మంత్రివర్గం అయితే ఉందో, వారితోనే మేము ఎన్నికలకు వెళ్ళబోతున్నామని క్లారిటీ ఇచ్చారు.