చంద్రబాబుకు చిరంజీవి శుభాకాంక్షలు

నేడు చంద్రబాబు 70వ పుట్టినరోజు

chiranjeevi-chandrababu
chiranjeevi-chandrababu

హైదరాబాద్‌: నేడు ఏపి మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు 70వ జన్మదినం సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘దశాబ్దాలుగా అహర్నిశం ప్రజా సేవలో కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుతున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సర్. మీ దూరదృష్టి, కష్టపడే మనస్తత్వం, అంకితభావం అత్యున్నతమైనవి’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో పాటు గతంలో చంద్రబాబుతో ఓ వేడుక సందర్భంగా సరదాగా గడిపిన ఒక ఫోటోను షేర్ చేశారు.
జన్మదినం సందర్భంగా చంద్రబాబుకు రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/