వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు.. షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సిఎం జగన్‌

ysr-kalyanamasthu-ysr-shaadi-tohfa-funds-release

అమరావతి : సిఎం జగన్‌ వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా నిధులను విడుదల చేశారు. జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు “వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు”. “వైఎస్‌ఆర్ షాదీ తోఫా” క్రింద రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వధువుల తల్లుల ఖాతాల్లో సిఎం జగన్‌ జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు / వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా… ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తూ, ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి, ఇప్పటి వరకు రూ.349 కోట్లను 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. వయసు పరిమితి పెట్టడం వల్ల బాల్యవివాహాలు తగ్గుతాయని…పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపించాలనే మోటివేషన్ కల్పించడం మరో ఉద్దేశ్యం అన్నారు.