గవర్నర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో వైద్య వ్యవస్థ ఫై గవర్నర్ తమిళసై చేసిన కామెంట్స్ ను మంత్రి హరీష్ రావు ఖండించారు. ఒక డాక్టర్ అయ్యిండి డాక్టర్స్ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తుంటే గవర్నర్ మాత్రం విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వైద్యసేవలు బాగోలేవని ఎలా అంటారని, ఈ కామెంట్స్ ను తాము తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

శుక్రవారం తాండూరు నియోజకవర్గం పరిధిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ పీ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ శ్రీనివాసరావులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సరా నుండి ఏఎన్ఎం స‌బ్ సెంట‌ర్ల‌ను బస్తీ దవఖానాలుగా మార్చనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి జీతాలను అందిస్తూ ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు. కరోనా సమయంలో, వాక్సినేషన్ విషయంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తోపాటు సీనియర్ అధికారులు చేసిన కృషి అభినందనీయమని మంత్రి కొనియాడారు.