బిఆర్ఎస్ ఫై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

వైస్సార్సీపీ నేతలు వరుసపెట్టి కేసీఆర్ ఫై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్ గా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ని ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిఆర్ఎస్ ఉనికిని చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నేతలతో మాట్లాడుతూ వస్తున్నారు. ఇక పక్క రాష్ట్రం ఏపీ ఫై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటీకే ఇతర పార్టీల నేతలతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ నేత తోట చంద్రశేఖర్ తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్ఠ‌సార‌థిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పడం జరిగింది.

ఇదిలా ఉంటె ఏపీపై కేసీఆర్ ఫోకస్ చేయడం తో వైస్సార్సీపీ నేతలు బిఆర్ఎస్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటీకే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏపీలో బిఆర్ఎస్ అనేది శూన్యమని కామెంట్స్ చేయగా..మాజీ మంత్రి పేర్ని నాని అయితే కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. ఏపీకి వచ్చి బిఆర్ఎస్ వాళ్లు ఉద్ధరించేంది ఏంటని ప్రశ్నించారు. శ్రీశైలం డ్యామ్ వద్ద, నాగార్జున సాగర్‌లో తెలంగాణ దొంగ కరెంట్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపించారు. ‘మా ఆస్తులన్నీ తీసుకొని డబ్బులు ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు ప్రస్తుతం భయంలో ఉన్నారని.. మోడీ ఎక్కడ వస్తారో, అమిత్ షా ఎక్కడ వస్తారో అనే భయం వెంటాడుతోందని పేర్ని నాని విమర్శించారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రుల పేర్లు లాటరీలు తీస్తున్నారని సెటైర్లు వేశారు.

‘టీఆర్‌ఎస్ అంతర్ధానమైపోయిందిగా.. కొత్తగా బీఆర్‌ఎస్ అనుకుంటా. కేసీఆర్ ఏంటి ఇక్కడికి వచ్చి చేసేది? శుభ్రంగా అక్కడ చూసుకోమని చెప్పండి. అక్కడే సరిగా లేకుంటే.. మళ్లీ ఇవన్నీ ఎందుకు? ఏ లాటరీలో ఎవరి చీటీ తగులులుతందో అని ఓ వైపు వాళ్ల మంత్రులందరూ కంగారు పడతా ఉంటే..!’ అంటూ పేర్ని నాని విమర్శలు చేశారు.