హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నవంబర్ 12న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు..68 స్థానాలకు ఒకేసారి పోలింగ్

న్యూఢిల్లీః ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం.. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబర్ 27వరకు నామినేషన్‌లను పరిశీలిస్తారు. అక్టోబర్ 29 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు.
కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ నుంచి 45 మంది, కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. 2023 జనవరి 8న హిమాచల్‌లో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఈసీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. అయితే 1985 నుంచి ఇప్పటివరకు హిమాచల్‌ప్రదేశ్‌లో ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలువలేదు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/