27 ఏళ్లకే 301 అంతర్జాతీయ వికెట్లు తీసా

చాలా మంది 27 ఏళ్లకు మొదలు పెడితే నేను మాత్రం ముగించా: ఇర్ఫాన్‌ పఠాన్‌

Irfan Pathan
Irfan Pathan

ముంబయి: టీమిండియా వెటరన్ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. గాయాల కారణంగా పడుతూ లేస్తూ సాగిన కెరీర్‌కు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. ఆటలోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం పేర్కొన్నాడు. ఇర్ఫాన్‌ పఠాన్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘చాలా మంది 27-28 ఏళ్లలో ఆరంగేట్రం చేస్తున్నారు. 35 ఏళ్ల వరకు కొనసాగుతున్నారు. కానీ.. నా కెరీర్ 27 ఏళ్లకే ముగిసిపోయింది. నేను 27 ఏళ్లకే 301 అంతర్జాతీయ వికెట్లు తీసా. నేను 500-600 వికెట్లు, మరిన్ని పరుగులు చేయాలని కోరుకుంటున్నా. కానీ ఆలా జరగలేదు. మరొకొన్ని ఏళ్లు ఆట కోల్పోయానన్న బాధ ఉంది’ అని తెలిపాడు. ‘కెరీర్ అత్యుత్తమంగా ఉన్నప్పుడే ఎక్కువ అవకాశాలు పొందాలి. నా విషయంలోఏ కారణాల వల్ల జరగలేదో తెలియదు. ముష్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించినప్పుడు నేను తిరిగి జాతీయ జట్టుకు ఆడబోనని 2016 తర్వాత తెలిసింది. సెలెక్టర్లతో మాట్లాడినప్పుడు వారు నా బౌలింగ్ పట్ల చాలా సంతోషంగా లేరు. నేను ఉత్తమ ఆల్‌రౌండర్’ అని పఠాన్‌ పేర్కొన్నాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/