తొలి రోజు రెండు ఇన్నింగ్స్‌

ఇండియాకు 86 పరుగుల ఆధిక్యం

The first day-two innings‌
The first day-two innings‌

సిడ్నీ : తొలి టెస్టుకు సన్నాహకంగా ఆడుతున్న మూడు రోజుల డే-నైట్‌ మ్యాచ్‌లో టీమిండియా తొలి రోజున 86 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. మొదటి రోజు ఇరు జట్ల మొదటి ఇన్నింగ్స్‌లు ముగియడం గమనార్హం.

తొలుత ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకు ఆలౌట్‌ కాగా, సమాధానంగా ఆస్ట్రేలియా-ఎ 108 పరుగులకే కుప్పకూలింది. ఇండియా ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్‌ బుమ్రా(55) టాప్‌ స్కోరర్‌ కాగా, నవదీప్‌ సైనీ, మహ్మద్‌ సమి చెరి మూడు వికెట్లతో రాణించారు. తొలి రోజు ఆటతీరు చూస్తే మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ఫలితం తేలేలా కనిపిస్తోంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియా ఆరంభంలో తొట్రుపడింది. స్కోరు 9 పరుగులవద్దే మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం పృధ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ అర్ధసెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

ముఖ్యంగా పృధ్వీ షా(40) ఎదురుదాడికి దిగి బౌండరీలతో వేగంగా పరుగులు సాధించాడు. ఆరున్నర ఓవర్లలోనే వారు 61 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని విల్‌ సదర్లాండ్‌ విడదీశాడు. తరువాత వచ్చిన హనుమ విహారి కొద్దిసేపు నిలబడినా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ఆడలేకపోయాడు.

వైల్డర్‌మత్‌ విహారిని అవుట్‌ చేయడం మొదలు ఇండియా ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. గిల్‌ 43 పరుగులకు వెనుతిరిగాడు. 21 పరుగుల వ్యవధిలో ఇండియా ఆరు వికెట్లను కోల్పోయింది. దీనితో ఇండియా 150 పరుగులైనా చేయగలదా అనిపించింది

. అయితే పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అసలుసిసలు బ్యాట్స్‌మెన్‌వలె ఆడి జట్టును ఆదుకున్నాడు. బుమ్రా చివరి బ్యాట్స్‌మెన్‌ మహ్మద్‌ సిరాజ్‌ అండతో పదో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడమేకాక అజేయంగా అర్ధసెంచరీ చేసి పరిశీలకులను మెప్పించాడు.

సిరాజ్‌ 22 పరుగులకు అవ్ఞటవడంతో ఇండియా ఇన్నింగ్స్‌ 194 పరుగులకు ముగిసింది. బుమ్రా 57 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వైల్డర్‌మత్‌, సీన్‌ అబ్బాట్‌ చెరి మూడు వికెట్లు దక్కించుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకూడా వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. ఆరు పరుగులవద్ద టెస్టు ఓపెనర్‌ స్థానం ఆశిస్తున్న బర్న్ప్‌ అవ్ఞట్‌ కాగా, మార్కస్‌ హారిస్‌, నిక్‌ మాడిసన్‌ కొద్దిసేపు నిలబడ్డారు.

రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించిన తరువాత ఒకే ఓవర్లో హారిస్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌ అవ్ఞటయ్యారు. ఈ రెండు వికెట్లు షమి ఖాతాలోకి చేరాయి. ఆ తరువాత అలెక్స్‌కేరీ(32), జాక్‌ వైల్డర్‌మత్‌(12) మినహా తక్కినవారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ వన్డే తరహాలో సాగింది. హారీ కాన్వే రనౌట్‌ ఆసీస్‌-ఎ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ జట్టు కేవలం 32.2 ఓవర్లలోనే 108 పరుగులకు ఆలౌటయింది. షమి 3, నవదీప్‌ సైనీ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.

స్కోర్‌బోర్డ్‌ :

ఇండియా ఇన్నింగ్స్‌ – పృధ్వీ షా బి విల్‌ సదర్లాండ్‌ 40, మయాంక్‌ అగర్వాల్‌ సి బర్న్స్‌ బి అబ్బాట్‌ 2, శుభ్‌మన్‌ గిల్‌ సి అలెక్స్‌ కేరీ బి గ్రీన్‌ 43, హనుమ విహారి బి వైల్డర్‌మత్‌, 15, అజింక్య రహానె సి అలెక్స్‌ కేరీ బి వైల్డర్‌మత్‌ 4, రిషభ్‌ పంత్‌ ఎల్బీ వైల్డర్‌మత్‌ 5, వృద్ధిమాన్‌ సాహ సి వైల్డర్‌మత్‌ బి అబ్బాట్‌ 0, నవదీప్‌ సైనీ సి మాడిసన్‌ బి కాన్వే 4, మహ్మద్‌ షమి సి అలెక్స్‌ కేరీ బి అబ్బాట్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా నాటౌట్‌ 55, మహ్మద్‌ సిరాజ్‌ సి మార్కస్‌ హారిస్‌ బి స్వెప్సన్‌ 22, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం(48.3 ఓవర్లలో ఆలౌట్‌)194.

వికెట్ల పతనం : 1-9, 2-72, 3-102, 4-102, 5-106, 6-111, 7-111, 8-116, 9-123, 10-194.
బౌలింగ్‌ : సీన్‌ అబ్బాట్‌ 12-6-46-3; కాన్వే 11-3-45-1; విల్‌ సదర్లాండ్‌ 9-0-54-1; గ్రీన్‌ 6.1-2-20-1; వైల్డర్‌మత్‌ 8-4-13-3; స్వెప్సన్‌ 2.2-0-15-1.

ఆస్ట్రేలియా ఎ – మార్కస్‌ హారిస్‌ సి శుభ్‌మన్‌ గిల్‌ బి మహ్మద్‌ షమి 26, జో బర్న్స్‌ సి పంత్‌ బి బుమ్రా 0, నిక్‌ మాడిసన్‌ సి వృద్ధిమాన్‌ సాహ బి మహ్మద్‌ సిరాజ్‌ 19, బెన్‌ మెక్‌డెర్మాట్‌ ఎల్బీ మహ్మద్‌ షమి 0, అలెక్స్‌ కేరీ సి పంత్‌ బి నవదీప్‌ సైనీ 32, సీన్‌ అబ్బాట్‌ సి పంత్‌ బి మహ్మద్‌ షమి 0, జాక్‌ వైల్డర్‌మత్‌ సి పంత్‌ బి బుమ్రా 12, విల్‌ సదర్లాండ్‌ సి శుభ్‌మన్‌ గిల్‌ బి నవదీప్‌ సైనీ 0, పాట్రిక్‌ రో నాటౌట్‌ 0, మిచెల్‌ స్వెప్సన్‌ సి వృద్ధిమాన్‌ సాహా బి నవదీప్‌ సైనీ 1, హారీ కాన్వే రనౌట్‌ 7, ఎక్స్‌ట్రాలు 4,
మొత్తం(32.2 ఓవర్లలో ఆలౌట్‌)108.

వికెట్ల పతనం : 1-6, 2-46, 3-46, 4-52, 5-56, 6-83, 7-84, 8-97, 9-99, 10-108.
బౌలింగ్‌ : మహ్మద్‌ షమి 11-4-29-3; జస్ప్రీత్‌ బుమ్రా 9-0-33-2; మహ్మద్‌ సిరాజ్‌ 7-1-26-1; నవదీప్‌ సైనీ 5.2-0-19-3.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/