నమ్మకం, విశ్వాసంపై రుణాలు ఇవ్వడం జరుగుతుంది


గత కొద్దికాలంగా జరుగుతున్నా పరిణామాల వల్ల బ్యాంకులు విశ్వాసాన్ని కోల్పోతున్నాయి

Rajnish Kumar
Rajnish Kumar

న్యూఢిల్లీ: నమ్మకం, విశ్వాసంపై రుణాలు ఇవ్వడం జరుగుతుందని.. గత కొద్దికాలంగా జరుగుతున్న పరిణామాల వల్ల బ్యాంకులు విశ్వాసాన్ని కోల్పోతున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అన్నారు. ఏ దేశాభివృద్ధి అయినా ఎంటర్‌ప్రెన్యూర్లపై ఆధారపడి ఉంటుంది. ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే.. కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయే తప్ప ప్రమోటర్లు బాగానే ఉంటున్నారు. కంపెనీలు మూతపడితే.. ఉద్యోగులు, సరఫరాదారులు నష్టపోతున్నారే తప్ప ప్రమోటర్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండడం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకింగ్‌, ఫండింగ్‌, ఆర్థిక వ్యవస్థ తీరు, తెన్నులపై ఫిక్కీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్‌ సెషన్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కంపెనీ రుణాలపై ఏ ప్రమోటరూ వ్యక్తిగత గ్యారంటీలు ఇవ్వడం లేదని.. ప్రమోటర్లు కంపెనీలకు ట్రస్టీలుగా వ్యవహరించాలని సూచించారు.
ఎస్‌బీఐ కార్పొరేట్‌ కంపెనీలను ఖాతాదారులుగా చూడడం లేదని, కార్పొరేట్‌ ఎకో సిస్టమ్‌లో ఒక భాగం కావాలనుకుంటోందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎ్‌సఎంఈ) రంగంలో క్రమంగా ఫార్మలైజేషన్‌ పెరుగుతోందని.. దీని వల్ల డేటా అందుబాటులోకి వచ్చి మరింతగా ఎంఎ్‌సఎంఈలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వీలువుతోందన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/