సినీ పరిశ్రమలో నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేసారు – పాయల్ రాజ్ పుత్

Family entertainer 'Intinti Ramayanam'

RX 100 మూవీ తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన పాయల్..చిత్రసీమలో కొంతమంది వల్ల ఛాన్సులు లేకుండా పోయాయి అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫస్ట్ మూవీ తోనే యూత్ ను కట్టిపడేసిన పాయల్..ఆ తర్వాత వరుస ఛాన్సులు తలుపు తట్టినప్పటికీ..అవన్నీ కూడా పెద్దగా విజయాలు సాదించకపోయేసరికి అమ్మడికి ఛాన్సులు తగ్గాయి. తాజాగా ఈమె మాయాపేటిక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాయల్ మాట్లాడుతూ.. RX 100 సినిమా తర్వాత టాలీవుడ్ లో కొంతమంది నన్ను మిస్ గైడ్ చేశారు. నేను నమ్మిన వాళ్ళే నన్ను అడ్వాంటేజ్ గా తీసుకొని వాడుకున్నారు. ఆ సినిమా వద్దు, ఈ సినిమా చేయి అంటూ నాకు తప్పుడు సలహాలు ఇచ్చారు. వారి వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్ళకి అది అర్థమయి వాళ్ళని దూరం పెట్టాను. ఇప్పుడు నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఏ సినిమా చేయాలి, ఏ సినిమా చేయకూడదు అని నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పుకొచ్చింది.