వైసీపీ కనుసన్నల్లోనే కాపు రిజర్వేషన్ ఉద్యమ విధ్వంసం

త్రికరణశుద్ధితో ముందుకు సాగాలి : పవన్ కళ్యాణ్

Pawan in Jaggam Peta on Sunday night-1

Amaravati: ఏ ఉద్యమం అయినా త్రికరణశుద్దిగా జరగాలి. లేకుంటే అమాయకులు బలైపోతారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో వైసీపీ నాయకులకు రిజర్వేషన్లు రావని ముందే తెలుసు. అయినా కాపులను మోసం చేయాలని, ఎగదోయాలని పన్నాగం పన్ని కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అసంపూర్తిగా వారికి అనుకులంగా మలుచుకున్నారు. 2014లో జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమం మొత్తం వైసీపీ నాయకుల కనుసన్నల్లో జరిగింది. కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతికి చెందిన కరుణాకర్ రెడ్డి వంటి నాయకులు రిజర్వేషన్ రాదని తెలిసినా కాపులను కావాలని వారి అవసరానికి ఉద్యమం చేసేలా ఎగదోశారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ ఉద్యమం అయినా ఒక దశ దిశతో అహింసాయుతంగా ముందుకు వెళ్లాలి. సమాజంలో ఉన్నవారందరని ఉద్యమం ప్రభావితం చేయాలి, వారి మద్దతు కూడగట్టుకోవాలి. కాపు రిజర్వేషన్ ఉద్యమం సమయంలో కొబ్బరి కిరాయి మూకలను పెట్టి వైసీపీ మూకలే ట్రైన్ తగలబెట్టించారు. కిరాయిమూకలు చేసిన పనికి అమాయకులైన కాపు యువత కేసులు ఎదుర్కొన్నారు. వారి జీవితమంతా ఫణంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ అందరూ కలిసి పోరాడి సాధించుకున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “ మంద కృష్ణ మాదిగ రెండు దశాబ్ధల పాటు సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ రోజు ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మద్దతు తెలిపారు. ఒక కుల ఉద్యమం అయినా, రాష్ట్ర ఉద్యమం అయినా త్రికరణ శుద్ధిగా పనిచేయలి. లేకపోతే సమాజంలో అమాయకులైన యువత కల్లబొల్లి మాటలకు బలైపోతారు. నన్ను తిడుతున్నా నాయకులు కాపులను తాకట్టు పెట్టేస్తున్నావు అని అంటున్నారు. నాకు ఆ స్థాయి ఉందని నేను అనుకోవడం లేదు. నేను పుట్టిన కులంతో సహా అన్ని కులాలను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలదే నా ఆకాంక్ష. రెల్లి కులం తీసుకొని రెల్లి సోదరులను మనస్ఫూర్తిగా గుండెకు హత్తుకున్నానంటే అంతా ఒక్కటే అని చెప్పడమే. మత్సకారు సోదరులు నాకు గంగ స్నానం చేయించి ఎందుకు గుండెల్లో పెట్టుకుంటారు. నేను అందరినీ ఒకేలా చూస్తానని అన్ని వర్గాలు నమ్ముతాయి. అందుకే నాకు అంతా అండగా నిలుస్తారు.

• జగన్ ను కాపు నాయకులు ఎందుకు ప్రశ్నించలేదు?
కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని జగన్ ఖరాకండీగా చెప్పాడు. అయినా కొంతమంది కాపు నాయకులు ఆయనకు మద్దతు తెలిపారు. కాపు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినా జగన్ కు మీరు ఎలా మద్దతు తెలుపుతారు..? రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందని అనుకుందాం. కనీసం ఈబీసీ రిజర్వేషన్ 5 శాతం తొలగించినా కాపు నాయకులు ఎందుకు మాట్లాడలేదు..? కాపులకు 5 శాతం కాదు రెండు, మూడు శాతమైనా ఇవ్వొచ్చు కదా..? అరశాతం కూడా రిజర్వేషన్ ఇవ్వని జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీయండి. జగన్ కు ఓటు వేయాలని వచ్చే కాపు నాయకులను గట్టిగా నిలదీయండి.. అని పేర్కొన్నారు.

అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/international-news/