కొత్త ఏడాది లో పవన్ కొత్త చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు. హరిహర వీరమల్లు మూవీ ఫిబ్రవరి లో పూర్తి కాబోతుండగా..వెంటనే హరీష్ మూవీ స్టార్ట్ చేస్తాడు. దీంతో మరో రీమేక్ మూవీ ని సైతం చేయబోతున్నట్లు తెలుస్తుంది. తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సితం’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు.

ఫాంటసీ కామెడీ డ్రామా కథతో తెరకెక్కి తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి పవన్‌ చేయబోతున్నాడు. కొత్త ఏడాది కానుకగా ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నది. మాతృకను రూపొందించిన నటుడు సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారు. మన నేటివిటీతో పాటు పవన్‌ ఇమేజ్‌కు తగినట్లుగా కథలో మార్పులు చేస్తున్నారు. జనవరి నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం.