గణేష్ నిమజ్జనం సందర్బంగా వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు

గణేష్ నిమజ్జనం సందర్బంగా వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నగర పోలీసులు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య..ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. తెల్లవారుజాము నుంచే గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చడానికి మండపాల నుంచి తీసుకువెళ్తున్నారు. దారి పొడవునా బ్యాండ్ బాజాలతో, నృత్యాలతో కోలాహలం చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 10 వ తేదీ ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

ఆంక్షలు చూస్తే..

  • ములుగు, భూపాలపల్లి వైపు నుంచి హైదరాబాద్ కు వెళ్లే భారీ వాహనాలు ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్లాలి.
  • భూపాలపల్లి, పరకాల నుంచి ఖమ్మం వెళ్ళాల్సిన వాహనాలు ఆరేపల్లి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు నుంచి వెళ్లాలి.
  • భూపాలపల్లి, పరకాల నుండి వచ్చే భారీ వాహనాలు నర్సంపేట వైపు వెళ్ళవలసినవి కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పీరిలు గొర్రెకుంట నుంచి ప్రయాణించాలి.
  • నిమజ్జన సమయంలో ఎలాంటి భారీ వాహనములు సిటి లోపలికి అనుమతి లేదు.

అలాగే వరంగల్ లోకల్ లో ఆంక్షలు ఇలా ఉన్నాయి..

  • హన్మకొండ బస్టాండ్ నుంచి ములుగు , కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సీపీఓ,ద్వారా కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
  • హన్మకొండ బస్టాండ్ నుంచి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్ళు బస్సులు వయా బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా ప్రయాణించాలి.
  • వరంగల్ బస్టాండ్ నుంచి హన్మకొండ వైపు వచ్చు బస్సులు చింతల్ బ్రిడ్జి నుంచి రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హన్మకొండకు చేరుకోవాలి.
  • ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ, సీపీఓ, అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్ కు వెళ్లాలి.
  • ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ మరియు వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు అన్ని బంధం చెరువులో నిమజ్జనం చేయాలి.
  • చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఏనుమాముల రోడ్ నుంచి నర్సంపేట రోడ్ వైపుకు వెళ్ళాల్సి ఉంటుంది.
  • కోట చెరువులో వినాయక విగ్రహ నిమజ్జన అనంతరం వాహనాలు హనుమాన్ జంక్షన్ , పెద్దమ్మగడ్డ నుంచి
  • కేయూసీ జంక్షన్ మీదగా తిరిగి వెళ్లాలి.
  • సిద్దేశ్వర గుండములో నిమజ్జనం చేసిన తరువాత వాహనాలు శాయంపేట వైపు వెళ్ళే రోడ్డు ద్వారా వెళ్లాలి.
    6 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలతో ఉన్న వాహనాలు, వినాయక విగ్రహాలతో కూడిన లారీలు సిద్దేశ్వర గుండంలో నిమజ్జనానికి అనుమతించబడవు.
  • ఈ వినాయక విగ్రహ వాహనాలు నిమజ్జనం కోట చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువులకు వెళ్లాలి
    శాయంపేట వైపు నుండి వచ్చు వినాయక విగ్రహా వాహనాలు వయా హంటర్ రోడ్, అదాలత్, హన్మకొండ చౌరస్తా మీదుగా ప్రయాణించాలి.
  • కోట చెరువు వైపు నిమజ్జనం కొరకు వెళ్ళే వాహనాలు పెద్దమ్మగడ్డ, ములుగు జంక్షన్, యం.జి.యం, ఆటోనగర్ మీదుగా కోటచెరువుకు వెళ్ళాల్సి ఉంటుంది..