షర్మిల కు పాలేరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌంటర్

paleru-mla-counter-to-sharmila

YSRTP అధినేత్రి వైస్ షర్మిల కు పాలేరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మట్టి ముట్టుకున్నంత మాత్రాన తెలంగాణ బిడ్డవు కావని అన్నారు. రీసెంట్ గా షర్మిల పాలేరు లో పార్టీ ఆఫీస్ కు భూమి పూజా చేసిన సంగతి తెలిసిందే. అలాగే రాబోయే ఎన్నికల్లో పాలేరు నుండే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇక భూమి పూజా సందర్బంగా పాలేరు మట్టి ని పట్టుకొని పలు వాగ్దానాలు చేసింది. ఈ వాగ్దానాల పట్ల పాలేరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఈ మట్టి ముట్టుకున్నంత మాత్రాన ఈ ప్రాంత బిడ్డ కారు.. ఈ మట్టిలో పుడితే ఈ ప్రాంత బిడ్డవుతారని అన్నారు.

ఎంతమంది పాలేరులో పోటీకొచ్చిన స్వాగతిద్దాం, అవసరమైతే ఇంకో పది మందిని పోటీ చేయండి అని చెబుదామన్నారు. మనం వేరే ప్రాంతం పోయి ఈ ప్రాంత బిడ్డను అంటే వాళ్లు నమ్ముతారా… మనం కూడా అంతేనని పేర్కొన్నారు. టికెట్ నాకే నేనే పోటీ చేస్తానని వేరే వారిలా గొప్పలు చెప్పుకోను… వార్ వన్ సైడే అవతల వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కవని తేల్చి చెప్పారు.