అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కరోనా

బాగానే ఉన్నానంటూ ట్వీట్..టీకాలు తీసుకోని వారు వెంటనే వెళ్లి తీసుకోవాలని సూచన

Former US President Barack Obama tests positive for Covid-19

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా గొంతు సమస్యతో బాధపడుతున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి బాగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. మిచెల్‌కు మాత్రం నెగటివ్ అనే తేలిందని, ఇద్దరం వ్యాక్సిన్లు తీసుకున్నామని పేర్కొన్నారు.

కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దని, అందరూ టీకా తీసుకోవాలని కోరారు. ఇప్పటికీ ఎవరైనా టీకా తీసుకోని వారుంటే వెంటనే వెళ్లి టీకా తీసుకోవాలని సూచించారు. మరోవైపు, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసులు దిగివస్తుండడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/