పవన్ ‘వినోద‌యా సితం ‘ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క వరుస సినిమాలు , మరోపక్క రాజకీయాల తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ ఫై హరిహర వీరమల్లు, సుజిత్ డైరెక్షన్లో ఓ మూవీ , హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయనున్నాడు. ఇదిలా ఉండగానే సముద్రఖని డైరెక్షన్లో వినోద‌యా సితం చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టుకుంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండగా , త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారట. ఈ హాలీడే‌కు తోడు లాంగ్ వీకెండ్ ఉండడంతో కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ కొద్ది రోజుల్లోనే రాబోతుందని తెలిసింది. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్‌ను చేస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.