డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా రజనీకాంత్ నిర్మాత

డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. కేపీ చౌదరి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు తేలడంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. చిత్రసీమ ప్రముఖులకు డ్రగ్స్ నేరగాళ్ల కు మధ్య స్నేహ సంబంధం ఉంది.

డ్రగ్స్ కు అలవాటు పడ్డ కొంతమంది సినీ ప్రముఖులు ..డ్రగ్స్ నేరగాళ్ల దగ్గరి నుండి డ్రగ్స్ తీసుకుంటూ..సరఫరా చేస్తూ వస్తున్నారు. ఆ మధ్య పూరి జగన్నాథ్, ఛార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులను ఈడీ విచారించింది. చివరకు ఫోరెన్సిక్ నివేదికలో వీరంతా డ్రగ్స్ వాడనట్లుగా నివేదిక రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఈయన నుండి ఎవరెవరు డ్రగ్స్ తీసుకునే వారు అనే కోణంలో పోలీసులు విచారణ జరపనున్నారు.