‘టీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలు’

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజం

MP Arvind
MP Arvind

Nizamabad: టీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం కమ్మర్ పల్లి మండలం హస కొత్తూరులో ఆయన పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన మలావత్ సిద్ధార్థ్ కుటుంబాన్ని పరామర్శించి, బాధిత కుటుంబానికి రూ లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిద్ధార్థ్ బీజేపీ కార్యకర్త అని పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడనే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ హత్య చేయించాడని ఆరోపించారు. సిద్ధార్థ్ తండ్రి కి సీఎం రిలీఫ్ ఫండ్ రాకుండా మంత్రి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/