నేడు గుజరాత్‌ ఆప్‌ సిఎం అభ్యర్థిని ప్ర‌క‌టించ‌నున్న కేజ్రీవాల్‌

arvind-kejriwal-to-announce-aaps-gujarat-chief-minister-candidate-today

ఆహ్మదాబాద్‌ః నిన్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తేదీల‌ను ఈసీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో త‌మ పార్టీ త‌ర‌పున‌ పోటీప‌డే సీఎం అభ్య‌ర్థిని ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించ‌నున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు పార్టీకి స‌మ‌ర్పించిన అభిప్రాయాల ఆధారంగా అభ్య‌ర్థి పేరును కేజ్రీవాల్ వెల్ల‌డించ‌నున్నారు. ఆప్ రాష్ట్ర అధ్య‌క్షుడు గోపాల్ ఇటాలియా, జాతీయ కార్య‌ద‌ర్శి సుదాన్ గ‌ద్వీ, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ మ‌నోజ్ సొరాతియాలు సీఎం అభ్య‌ర్థి రేసులో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇవాళ అహ్మాదాబాద్‌లో ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. సీఎం అభ్య‌ర్థిపై ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. ఎస్ఎంఎస్‌, వాట్సాప్‌, వాయిస్ మెయిల్‌, ఈ మెయిల్ ద్వారా సీఎం అభ్య‌ర్తిపై అభిప్రాయాలు వెల్ల‌డించాల‌ని కేజ్రీ గుజ‌రాత్ ప్ర‌జ‌ల్ని కోరిన విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్ 1, 5 తేదీల్లో గుజ‌రాత్ పోల్స్ జ‌ర‌గ‌నున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/