హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకున్న ‘OG ‘

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాహో ఫేమ్ సుజిత్ కలయికలో ‘OG’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన మేకర్స్..కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టారు. ఈ కొత్త షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ , హీరోయిన్ ప్రియాంకలపై కీలక సీన్స్ చిత్రీకరించనున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్ అండ్ అనౌన్స్మెంట్ వీడియోకు ఆడియన్స్ అండ్ పవన్ ఫ్యాన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క వీడియోతో సినిమా ఎలా ఉండబోతోంది హిట్ ఇచ్చి అంచనాలు భారీగా పెంచేసాడు సుజీత్. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ తో పాటు పవన్ హరీష్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ , సముద్రఖని డైరెక్షన్లో ఓ మూవీ , క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీస్ చేస్తున్నాడు.