నిరుద్యోగులకు తీపి కబురు తెలిపిన భట్టి..

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెటన్‌ను శనివారం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ పద్దును ప్రవేశపెట్టారు.

ఈ బడ్జెట్ ప్రసంగంలో కేటాయించిన శాఖలకు సంబదించిన బడ్జెట్ ను భట్టి స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా నిరుద్యోగులకు తీపి కబురు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ‘మెగా DSC నిర్వహించబోతున్నాం. 15వేల కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ త్వరలో పూర్తి చేసి.. నియామకపత్రాలు ఇవ్వబోతున్నాం. నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం. యువత ఆకాంక్షలు నెరవేర్చేలా TSPSC తన కర్తవ్యం నిర్వహించడానికి రూ. 40 కోట్లు ఇచ్చాం’ అని తెలిపారు.

ఇక శాఖల వారీగా తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.

రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
ఆరు గ్యారంటీల కోసం రూ.53196 కోట్లు అంచనా
పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు
ఐటీ శాఖకు రూ.774కోట్లు
పంచాయతీ రాజ్ రూ.40,080 కోట్లు
పురపాలక శాఖకు రూ.11692 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.1000 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.19746 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ.21874 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు
బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
బీసీ సంక్షేమం రూ.8 వేల కోట్లు
విద్యా రంగానికి రూ.21389కోట్లు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
వైద్య రంగానికి రూ.11500 కోట్లు
గృహజ్యోతికి రూ.2418 కోట్లు
విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు
గృహనిర్మాణానికి రూ.7740 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు