‘అన్నీ మంచి శకునములే’ మూవీ టాక్

సంతోష్ శోభన్ , మాళవికా నాయర్ జంటగా నటించిన సినిమా అన్ని మంచి శకునములే. నందినీ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈసినిమా ను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్నాదత్, ప్రియాంకా దత్ లు నిర్మించారు. ఈరోజు (మే 18) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో..ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం.

సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదిక గా సినిమా ఎలా ఉందనేది కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనరే అయినా చాలా బోరింగ్‌గా ఉందని అంటున్నారు. కొన్ని డీసెంట్ కామెడీ సీన్లు, ఫీల్ గుడ్ మూమెంట్స్ మినహా మిగిలిన సినిమా అంతా సాగదీతలా అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. నెరేషన్ చాలా నెమ్మదిగా ఉందని.. తరవాత ఏం జరుగుతుంది అనే విషయం ప్రేక్షకుడు ఊహించేస్తాడని అంటున్నారు. కొంత మంది అయితే ఇది పర్ఫెక్ట్ ఓటీటీ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. కొందరికి క్లైమాక్స్ నచ్చిందట. సినిమా అంతా బాగానే ఉంది కానీ మరీ స్లోగా సాగే నెరేషన్ మైనస్ పాయింట్ అని అంటున్నారు.