అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇలా వాలంటీర్లను ఉసిగొలుపుతున్నారు – పవన్

pawan-kalyan

ఏలూరు సభ లో పవన్ కళ్యాణ్ వాలంటీర్లఫై చేసిన కామెంట్స్ ఫై వైస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలువురు వాలంటీర్లు సైతం రోడ్ల పైకి వచ్చి పవన్ కు వ్యతిరేకంగా నిరసనలు , దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లఫై అసలు తాను ఏమన్నారో మరోసారి స్పష్టం చేసారు.

మంగళవారం ఏలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైస్సార్సీపీ ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని, వైస్సార్సీపీ నాయకుల మాటలకు తన భార్య కూడా బాధపడుతుందని అన్నారు.

తనకు ముఖ్యమంత్రి జగన్ అంటే కోపం లేదని, ప్రభుత్వ విధానాల పైనే ద్వేషమన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందని, అమ్మాయిల అదృశ్యంపై వైస్సార్సీపీ నేతలు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారని ప్రశ్నించారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించవద్దన్నారు. రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, అందుకే నిలబడినట్లు తెలిపారు. తనను బెదిరించారని, డబ్బుతో మభ్యపెట్టాలని చూశారని షాకింగ్ కామెంట్లు చేశారు.